Breaking News

అందుకే డొనాల్డ్‌ ట్రంప్‌ డిన్నర్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ

Published on Fri, 06/20/2025 - 20:24

భువనేశ్వర్‌: తనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిన్నర్‌కు ఆహ్వానించినా అందుకు వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలిపానన్నారు. 

తనకు ఒడిశాలో ప్యూరీ జగన్నాథ్‌ పుణ్యభూమికి వెళ్లడం ముఖ్యమని ట్రంప్‌కు చెప్పినట్లు మోదీ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం, జూన్‌ 20)  ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. సుమారు 18 వేల కోట్ల విలువైన 100కు పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. 

‘నాకు ట్రంప్‌ నుంచి డిన్నర్‌ ఆహ్వానం అందింది. నేను జీ-7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు నన్ను వాషింగ్టన్‌కు రమ్మని ట్రంప్‌ ఆహ్వానించారు. అయితే మహాప్రభు జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లే అవసరం ఉండటంతో నేను ట్రంప్‌ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. 

రెండు రోజుల క్రితం కెనడా పర్యటనలో ఉన్నపపుడు వాషింగ్టన్‌ మీదుగా రమ్మని ట్రంప్‌ అన్నారు. కలిసి డిన్నర్‌ చేసి మాట్లాడుకుందాం అన్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఒడిశా జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పా’ అని మోదీ తెలిపారు. 

ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంలో తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారాయన.

 

ఏడాది విజయవంతంగా పూర్తయ్యింది
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుందని కొనియాడారు. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం ఒక్కటే కాదు.. మంచి పరిపాలన అందించినందుకు కూడా తొలి వార్షికోత్సవమన్నారు. ఏడాది కాలంలోనే బీజేపీ ప్రజల నమ్మకాన్ని చూరగొందని మోదీ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)