Breaking News

ట్రంప్‌, నెతన్యాహుకు మోదీ ఫోన్‌.. ఎందుకంటే?

Published on Fri, 10/10/2025 - 08:02

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో(Donald Trump) పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు​కి(Benjamin Netanyahu)  ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌నకు మోదీ అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మోదీ వెల్లడించారు.

ఇక, అంతకంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కూడా ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా(Gaza Peace) శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నామని మోదీ వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను ట్విట్టర్‌ వేదికగా మోదీ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రధాని మోదీ (PM Modi) ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన స్నేహితుడు మోదీతో మాట్లాడేందుకు కీలక సమావేశాన్ని కూడా నెతన్యాహు తాత్కాలికంగా ఆపేసుకున్నారు. హమాస్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చించేందుకు ఇజ్రాయెల్‌ భద్రతా కేబినెట్‌ భేటీ అయ్యింది. ఇందులో నెతన్యాహుతో సహా పలు కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని మోదీ నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో నెతన్యాహు వెంటనే సమావేశాన్ని తాత్కాలికంగా ఆపి మరీ మోదీతో మాట్లాడారు. బందీల విడుదలకు కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును మోదీ అభినందించారని ఇజ్రాయెల్‌ ప్రధాన కార్యాలయం తెలిపింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)