ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం

Published on Wed, 08/05/2026 - 13:44

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, లడఖ్‌ల ప్రయాణంలో ఆర్టికల్ 370 రద్దు ఒక ‘నిర్ణాయక నూతన అధ్యాయం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ను జాతీయ ప్రధాన స్రవంతిలో పూర్తిగా విలీనం చేసింది. ఈ ప్రత్యేక హోదా రద్దు ద్వారా దశాబ్దాలుగా ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్న మహిళలు, అట్టడుగు వర్గాలకు సాధికారత లభించిందని ప్రధాని పేర్కొన్నారు.
 

‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఏడేళ్ల కిందట ఇదే రోజున ఆర్టికల్ 370, 35(ఏ) చరిత్రలో కలిసిపోయాయని, నాటి నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మౌలిక వసతులు విస్తరించడంతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. నేడు దేశం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఆగస్టు 5వ తేదీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్‌ గైనకాలజీ పేపర్‌ లీక్‌?

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)