Breaking News

R-DAY 2026: ఈసారీ ‘మోదీ మార్క్’ వైరల్‌

Published on Mon, 01/26/2026 - 13:24

న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి కలబోతగా ఆయన ధరించిన దుస్తులు నిలిచాయి. ముఖ్యంగా ఆయన ధరించిన రాజస్థానీ శైలి తలపాగా ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.

పశ్చిమ భారతదేశంలో శుభప్రదమైన రంగులుగా భావించే ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, ‘లహరియా’ డిజైన్‌తో ప్రధాని మోదీ ధరించిన  తలపాగాను రూపొందించారు. ఏటా ఒక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక తలపాగాను ధరించాలన్న తన ఆనవాయితీని ప్రధాని మోదీ కొనసాగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టేలా ప్రధాని ఈ  తరహా ఎంపిక చేసుకున్నారు.
 

తలపాగాకు జతగా ప్రధాని లేత నీలం రంగు స్లీవ్‌లెస్ జాకెట్‌ను ధరించారు. ఇది సంప్రదాయ నెహ్రూ జాకెట్‌కు ఆధునిక రూపం. దీనిని ప్రస్తుతం ‘మోదీ జాకెట్’ అని పిలుస్తున్నారు. నాణ్యమైన ఖాదీ, చేనేత పట్టుతో తయారైన ఈ జాకెట్.. దేశీయ వస్త్ర పరిశ్రమపై ఆయనకున్న  అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. తలపాగా రంగులను పోలిన పాకెట్ స్క్వేర్ ఆయన వస్త్రధారణకు మరింత హుందాతనాన్ని  ఇచ్చింది.

ప్రధాని ధరించిన తలపాగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ‘బందేజ్’శైలిని పోలి ఉంది. కాగా ప్రధాని మోదీ ‘ఎక్స్’వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘గణతంత్ర దినోత్సవం మన దేశ గౌరవానికి, కీర్తికి ప్రతీక అని, ఇది పౌరుల జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని’ ఆయన ఆకాంక్షించారు. వికసిత భారత్ సంకల్పం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)