Breaking News

ప్రఖ్యాత విద్యాసంస్థల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Published on Tue, 02/20/2024 - 13:13

ఢిల్లీ: కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. ఇవాళ ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జమ్మూ నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారాయన. 

దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. జమ్ము కశ్మీర్‌ నుంచి ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది.  కొన్నేళ్లుగా జమ్ముకశ్మీర్‌ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదు. కుటుంబ రాజకీయాలు చేసేవాళ్లు.. వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారు. జమ్ముకశ్మీర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వికసిత్‌ కశ్మీర్‌కల సాకారం అవుతుంది.  మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుంది అని అన్నారాయన.  

వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ గవర్నర్‌, సీఎం జగన్‌
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్‌ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. 

విశాఖ ఐఐఎంకు సంబంధించి 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్‌ నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలోని ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్‌ భవనాలను పూర్తి చేశారు. 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)