Breaking News

ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి లాంటింది: ప్రధాని మోదీ

Published on Thu, 01/15/2026 - 14:41

ఢిల్లీ: పార్లమెంట్ సంవిధాన్ సదన్‌లో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ పార్లమెంటరీ లీడర్స్ 28వ సదస్సుకు భారత్‌ నేతృత్వం వహిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.

ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని.. భారత్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుందని ప్రధాని అన్నారు. భారత్ అభివృద్ధి గ్లోబల్ సౌత్, కామన్ వెల్త్  దేశాలకు ఉపయోగపడుతుందన్న మోదీ.. కరోనా సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసిందన్నారు. 

ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని  స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కామన్వెల్త్ దేశాల స్వీకరులతో బిర్లా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కామన్వెల్త్‌ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘‘ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల బాధ్యత ఎంత?. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?. పార్లమెంట్‌ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?’’ అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)