కుంభమేళాలో ఆకర్షించిన ప్రధాని వస్త్రధారణ

Published on Wed, 02/05/2025 - 15:02

ప్రయాగ్‌రాజ్‌:ప్రధాని మోదీ తాను ధరించే దుస్తుల ప్రత్యేకత గురించి వేరే చెప్పనవసరం లేదు. దుస్తుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ ట్రెండ్‌ను అనుసరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించే సందర్భం ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదాయానికి తగట్టు వ్యవహరిస్తూనే ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంటారు.

బుధవారం(ఫిబ్రవరి5) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఏకంగా మూడు రకాల దుస్తులు ధరించారు. అరాలీ ఘాట్‌ నుంచి త్రివేణి సంగమానికి బోట్‌లో వెళుతున్న సమయంలో సంప్రదాయ కుర్తా,పైజామా పైన నెహ్రూ జాకెట్‌ ధరించారు.

ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించే సమయంలో మాత్రం ప్రధాని సంప్రదాయానికి భిన్నంగా అథ్లీజర్‌ దుస్తులను ధరించారు. మెడలో నీలిరంగు స్కార్ఫ్‌ వేసుకుని మణికట్టుకు రుద్రాక్ష మాల చుట్టుకున్నారు.

స్నానం పూర్తయి హారతి ఇచ్చే సమయంలో కుర్తా,చుడీదార్‌ పైజామా వేసుకున్నప్పటికీ కుర్తాపై పఫ్ఫర్‌ జాకెట్‌ ధరించారు.తలపై రంగురంగుల పహారీ టోపీ ధరించారు. ప్రధాని కుంభమేళా పర్యటన సమయంలో ధరించిన దుస్తుల విషయంలో సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)