Breaking News

రాహుల్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Published on Thu, 06/19/2025 - 12:46

న్యూఢిల్లీ: ఈరోజు(జూన్‌ 19) కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతకు  ఆయన ‘ఎక్స్‌’లో అందించిన ఒక సందేశంలో రాహుల్‌ దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని  పేర్కొన్నారు.
 

రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర అగ్ర నేతలు కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సోషల్ మీడియాప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో సింగ్ ఇలా రాశారు, ‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో  జీవించాలని కోరుకుంటున్నాను’ అనిరాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి  ఎంకే స్టాలిన్ కూడా కాంగ్రెస్ నేత రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆదర్శ సోదరుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని పేర్కొన్నారు.  ఇండియన్ యూత్ కాంగ్రెస్ తమ నేత పుట్టినరోజు సందర్భంగా న్యూఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. అయితే బీజేపీ ఈ మేళాను ప్రచార స్టంట్‌గా అభివర్ణించింది.

ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌’ కేసు: బిగ్‌ ట్విస్ట్‌.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)