Breaking News

ఎర్రకోట వేదికగా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక

Published on Fri, 08/15/2025 - 08:08

సాక్షి,న్యూఢిల్లీ: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ.. దేశ భద్రతపై తన దృఢమైన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. 

పాకిస్తాన్‌ పదే పదే చేస్తున్న అణు బెదిరింపులను ఖండించారు. అణు దాడుల బెదిరింపులకు భారత్‌ భయపడదని తేల్చి చెప్పారు. అదే సమయంలో సింధూ జలాల ఒప్పందానికి తాము అంగీకరించబోమని పాక్‌కు స్పష్టం చేశారు. రక్తం, నీరు కలిసి పారటం కుదరదన్నారు.

సింధూ జలాల ఒప్పందం కారణంగా నా దేశ భూమి నీరు లేక కటకటలాడింది. రైతులు నీరు లేక అనేక బాధలు పడ్డారు. ఇకపై రైతులు అలాంటి బాధలు పడకూడదు. భారతదేశానికి హక్కుగా చెందాల్సిన నీరు భారతదేశానికి మాత్రమే’ అని తెలిపారు.  

నయా భారత్‌ థీమ్‌తో 
అంతకు ముందు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్ర కోట వేదిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. న్యూఇండియా (Naya Bharat) అనే థీమ్‌ ప్రతిబింబించేలా వస్త్రధారణతో దేశభక్తిని చాటిచెప్పారు.  ఇక ప్రధాని మోదీ ఇది వరుసగా 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.  ఆచారం ప్రకారం, ప్రధానమంత్రి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పగుచ్ఛాలు అర్పించి, జాతినుద్దేశించి ప్రసంగించే ముందు రెడ్ ఫోర్డ్ వద్ద ఉన్న చారిత్రాత్మక లాహోరి గేట్ (ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాన ద్వారం) వద్దకు చేరుకున్నారు. అక్కడ గౌరవ వందనాన్ని స్వీకరించారు.  అనంతరం, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)