Breaking News

సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్‌కు వార్నింగ్‌

Published on Thu, 10/31/2024 - 17:00

ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్‌లోని సర్‌ క్రీక్‌ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు.. ‘‘కచ్‌వైపు పాక్‌ కన్నెత్తి చూసే​ సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్‌ క్రిక్‌పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.

దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.

2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్‌డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్‌లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్, 2023లో హిమాచల్‌లోని లెప్చాలో పర్యటించారు.
 

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)