నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే

Published on Tue, 09/09/2025 - 08:46

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదాని హిమాచల్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ  రాష్ట్ర అధికారులను కలుసుకుంటారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వరద బాధితులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), ఆప్దా మిత్ర బృందంతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు.  మధ్యాహ్నం 3 గంటలకు  ఏరియల్‌ సర్వే నిర్వహించాక,  గురుదాస్‌పూర్‌ చేరుకుని, సాయంత్రం 4:15 గంటలకు సీనియర్ అధికారులతో  సమావేశం కానున్నారు.

హిమాచల్‌లో వరదల కారణంగా 355 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ  తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం కారణంగా ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. మరోవైపు బియాస్, సత్లుజ్, రావి, ఘగ్గర్ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పంజాబ్ హై అలర్ట్‌లో ఉంది. 23 జిల్లాల్లోని 1,650 కి పైగా గ్రామాలు నీట మునిగాయి, 1.75 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)