Breaking News

విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..

Published on Mon, 02/24/2025 - 11:09

భోపాల్‌: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్‌ చేరుకున్న ఆయన ఈరోజు(సోమవారం) భోపాల్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. అయితే ఆయన విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌(Global Investors Summit) జరిగే ప్రాంతానికి నిర్థారించిన విధంగా ప్రధాని ఉదయం 9.45కు హాజరు కావలసివుంది. అయితే ఈ కార్యక్రమానికి 10 గంటలకు వెళ్లే విధంగా ప్రధాని మోదీ తన షెడ్యూల్‌ మార్చుకున్నారు. నగరంలోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తన కాన్వాయ్‌ కారణంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.

భోపాల్‌లోని నేషనల్ మ్యూజియంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పారిశ్రామిక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group) చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ నాదిర్ గోద్రేజ్, రస్నా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ అధ్యక్షుడు పిరోజ్ ఖంబట్టా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ బాబా ఎన్ కళ్యాణి, సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రాహుల్ అవస్థి, ఏసీసీ లిమిటెడ్ సీఈఓ నీరజ్ అఖౌరి తదితరులు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 

ఆలస్యానికి అతిథులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని



ఇది కూడా చదవండి: Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)