Breaking News

ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..

Published on Fri, 07/14/2023 - 10:36

ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్‌ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్‌ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్‌ నేషనల్‌ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్‌ కళాప్రాంగణంలో ప‍్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు.

అవి..

► ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్‌ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్‌కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. 

► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 

► ఫ్రాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. 

► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్‌లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. 

► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. 

ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్‌

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)