Breaking News

Independence Day- 2024: అమరవీరులను గుర్తుచేసే ఆరు ప్రాంతాలు

Published on Tue, 08/06/2024 - 08:47

1947, ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి  విముక్తి  లభించింది. ఆరోజు నుంచి ప్రతీయేటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం పలువురు సమరయోధులు పోరాటాలు సాగించారు. వీరి త్యాగానికి గుర్తుగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారకాలు ఉన్నాయి. ఇదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్మారకాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆగస్టు 15న ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తారు.

1. కార్గిల్ వార్ మెమోరియల్ (లధాఖ్)
పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైనవారి గౌరవార్థం 1990ల చివరలో భారత సైన్యం కార్గిల్ వార్ మెమోరియల్‌ని నిర్మించింది. ఈ స్మారక చిహ్నంపై యుద్ధంలో వీరమరణం పొందిన భారతీయ సైనికులందరి పేర్లను చెక్కారు.

2. ఎర్రకోట (ఢిల్లీ)
ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి ప్రసంగించారు.ఈ ఎర్రకోటను షాజహాన్ నిర్మించారు. ఎరుపు రంగు ఇసుకరాయితో నిర్మించినందున దీనికి ఎర్రకోట అని పేరు పెట్టారు.

3. జలియన్ వాలా బాగ్ (అమృత్‌సర్‌)
1919లో జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్ర్య సమరయోధులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎటువంటి హెచ్చరిక లేకుండా జనరల్ డయ్యర్ కాల్పులు జరపాలని ఆదేశించాడు. నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందల మంది అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం జలియన్‌వాలాబాగ్‌లో స్మారక చిహ్నం నిర్మించారు.

4. ఇండియా గేట్(ఢిల్లీ)
దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉన్న ఇండియా గేట్ మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో  ప్రాణాలను అర్పించిన 82 వేల మంది భారతీయ ఆర్మీ సైనికుల గౌరవార్థం నిర్మితమయ్యింది. ఈ  అమరవీరుల పేర్లు ఇండియా గేట్ గోడలపై  కనిపిస్తాయి.

5. పోరుబందర్‌(గుజరాత్‌)
గుజరాత్‌లోని పోర్‌బందర్ జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. కీర్తి మందిర్, మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని గాంధీ జీవితంతో పాటు ఆయన రచనలను వివరించే మ్యూజియంలుగా మార్చారు.

6. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ (ప్రయాగ్‌రాజ్)
1931లో చంద్రశేఖర్ ఆజాద్ ఈ ప్రయాగ్‌రాజ్ పార్కులో బ్రిటిష్ సైనికులతో పోరాడారు. అతను తన 25 ఏళ్ల వయస్సులోనే జీవితాన్ని త్యాగం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌ను బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు, వారి తూటాలకు బలికావడం ఇష్టం లేక ఈ పార్కులో తనను తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఈ పార్కులో చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)