Breaking News

పైలెట్‌ పాడుపని.. సిగరెట్‌ లైటర్‌ స్పై కెమెరాలతో..

Published on Fri, 09/05/2025 - 19:07

ఢిల్లీ: నగరంలో ఓ పైలట్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పైలెట్‌ మోహిత్‌ ప్రియదర్శిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాల్స్‌కు వచ్చే యువతులను టార్గెట్‌ చేసిన మోహిత్‌.. స్పై కెమెరాతో యువతుల వీడియోలు తీస్తూ..  కీచకుడి అవతారం ఎత్తాడు. సిగరెట్‌ లైటర్‌ ఆకారంలో ఉన్న స్పై కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల ఢిల్లీలోని కిషన్‌గఢ్ ప్రాంతంలోని శని బజార్‌లో మోహిత్‌ లైటర్‌తో మహిళల వీడియోలను రికార్డ్‌ చేయడాన్ని ఓ యువతి గమనించింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. అనంతరం మార్కెట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు.

మోహిత్ ప్రియదర్శి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. విచారణలో నిందితుడు ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. మోహిత్‌ వద్ద నుంచి స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళలకు సంబంధించిన అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు.
 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)