Breaking News

Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్..

Published on Wed, 08/24/2022 - 20:08

తిరువనంతపురం: ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తాయి. కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోతారు. బంధువులు, చుట్టుపక్కల వారు వారిని ఓదారుస్తుంటారు. కానీ కేరళ పథానంతిట్ట జిల్లా మలపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో కుటుంబసభ్యులు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. 95 ఏళ్ల బామ్మ చనిపోతే.. ఆమె శవపేటిక చుట్టూ చేరి నవ్వుతూ ఫోటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

ఇంట్లో ఒకరు చనిపోతే మీరంతా ఎలా నవ్వుతున్నారని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం ఆ ఫోటోలో ఏం తప్పులేదని కుటంబసభ్యులను వెనకేసుకొచ్చారు. దీనిపై పెద్ద చర్చే పెట్టారు. కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి కూడా ఈ చర్చలో భాగమయ్యారు.

95ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న మరణించారు. ఆమెకు 9 మంది సంతానం. వాళ్లకు 19 మంది పిల్లలున్నారు. కుటుంబసభ్యులంతా దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో  కొద్ది వారాల పాటు మంచానికే పరిమితమై  మరియమ్మ కన్నుమూశారు. విషయం తెలిసి  దాదాపు కుటంబసభ్యులు అందరూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జ్ఞాపకార్థం ఓ ఫోటో దిగాలని కెమెరా ముందు నవ్వుతూ కన్పించారు.

మరియమ్మ బతికినంతకాలం ఎంతో సంతోషంగా జీవించారని, అందరినీ ప్రేమగా చూసుకున్నారని ఓ కుటుంబసభ్యుడు తెలిపారు. అందుకే ఆమెకు కుటుంబసభ్యులంతా ఆనందంతో వీడ్కోలు ఇవ్వాలనుకున్నట్లు పేర్కొన్నారు. నవ్వుతూ ఫోటో దిగడంలో తప్పేమీ లేదన్నారు.

కేరళ మంత్రి శివన్‌కుట్టి కూడా కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. చావు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జీవితాంతం ఆనందంగా బతికిన వారిని అంతిమ వీడ్కోలులో నవ్వుతూ సాగనంపడంలో తప్పేం లేదన్నారు. ఈ ఫోటోపై నెగెటివ్‌గా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు యువనేత గుడ్‌బై.. గాంధీలపై విమర్శలు

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)