Breaking News

ఫోన్‌ పౌచులు అమ్మి.. నీట్‌ విజేతగా..

Published on Mon, 06/16/2025 - 12:42

కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్‌ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్‌ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.

జార్ఖండ్‌కు చెందిన రోహిత్‌ కుమార్‌(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్‌ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్‌ ఇండియాలో 12,484 ర్యాంక్‌ సాధించాడు(కేటగిరీ వైజ్‌గా 1,312 ర్యాంక్‌). ఫిజిక్స్‌ వాలాగా పేరుకున్న అలఖ్‌ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

రోహిత్‌ కుమార్‌ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్‌ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్‌. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్‌ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్‌ ఫోన్‌ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.

ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్‌ కుమార్‌.. పగలంతా తన బండి మీద సెల్‌ ఫోన్‌ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్‌లో ర్యాంకుతో రోహిత్‌ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్‌ వాలా అలఖ్‌ పాండే ఆ కుర్రాడికి డాక్టర్‌ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్‌గా ఆ వైట్‌ కోట్‌ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్‌ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్‌కు చెందిన మహేష్‌ కుమార్‌ 99.09999547 శాతంతో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్‌ ఫిమేల్‌ టాపర్‌గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్‌ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)