Breaking News

ఒడిశా వరదల్లో కొత్త భయం

Published on Mon, 08/03/2026 - 14:43

భువనేశ్వర్ : ఒడిశాలోని జాజాపూర్‌ జిల్లాలో వరదల వల్ల ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. అసలే వరదల వల్ల గూడు చెదిరి ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు పాములతో సరికొత్త సమస్య వచ్చి పడింది. వరదనీటితో పాటు పాములు సైతం ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. విషపు జీవులు కరిచివేయడం వల్ల ఇప్పటికే దాదాపు 76మందికి పైగా ఆసుపత్రులలో చేరారు.

దశరథ్‌పూర్ బ్లాక్‌లోని గ్రామాల్లోని వీధులు, సంతల రోడ్లపైకి విపరీతంగా వరద చేరింది. దేవాలయాలు ఇళ్లు, ప్రభుత్వకార్యాలయాలన్నిటినీ వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలు కావడంతో  ప్రజలు తినడానికి, నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ సమస్యలతో సతమవుతున్న ప్రజలకు ఇప్పుడు ఊహించని విపత్తు కొత్త తలనొప్పిని తెచ్చింది. భారీవరదలకు  విష సర్పాలు , ఇతర విష సరీసృపాల ఇండ్లలోకి చేరుతున్నాయి. ప్రజల ఇళ్లు, నివాసాలు, పంజరాలలో ఆశ్రయం పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అక్కడి ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం. గత ఐదు రోజుల్లో మంగళ్‌పురా మెడికల్ సెంటర్‌లో 76 మందికి పైగా చికిత్స పొందారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి అమృత ప్రీతమ్ మల్లా తెలిపారు. వీరిలో 37 మందిని గుర్తుతెలియని జంతువులు, 11 మందిని పాములు కాటు వేసినట్లు తెలిపారు.దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విషసర్పాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  •  జాగ్రత్తలు

  • కరెంటు లేనప్పుడు టార్చ్ లైట్‌ను ఉపయోగించాలి

  • చీకటి ప్రదేశంలో  తిరిగేటప్పుడు లైటును ఉపయోగించాలి. 

  • బూట్లు, బట్టలు వేసుకునే ముందు వాటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి.

  • నేలపై పడుకోవడానికి బదులుగా, మంచం వంటి ఎత్తైన ప్రదేశాన్ని ఉపయోగించాలి.

ఒకవేళ పాములు లేక ఇతర విషసర్పాలు కాటు వేసినట్లు అనుమానం వస్తే స్వంత చికిత్స కాకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అని ప్రకటన విడదల చేశారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)