Breaking News

ఒక్క నెలలో 18 గుండెపోటు మరణాలు.. ‘హసన్‌’పై విచారణకు ఆదేశాలు

Published on Tue, 07/01/2025 - 13:44

హసన్‌: దేశంలో ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య మరింతగా పెరుగుతూ వస్తోంది. ఇదే కోవలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో  ఒక్క నెలలోనే 18 మంది గుండెపోటుతో మరణించిన దరిమిలా రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ మరణాలపై దర్యాప్తు చేప్టటాలని వైద్యాధికారులను ఆదేశించారు.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలో 18 మంది గుండెపోటుతో మరణించగా, వారిలో యువకులే అత్యధికంగా ఉన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ విధమైన గుండెపోటు కేసుల పెరుగుదలను నివారించేందుకు వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారిక దర్యాప్తు జరుగుతోందని  ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

హసన్ జిల్లాలో చోటుచేసుకున్న గుండెపోటు మరణాలపై జయదేవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ సి.ఎన్. రవీంద్ర నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం అధ్యయనం  చేసి, నివేదికను పది రోజుల్లోగా  అందజేయనుంది. హసన్‌లో ఇటీవలి కాలంలో 20 నుంచి 30 ఏళ్లలోపు వయసుకలిగిన యువకులు గుండెపోటులో మృతిచెందడం గమనార్హం. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, అధిక ఒత్తిడిని కలిగించే జీవనశైలి మొదలైనవి గుండెపోటుకు ప్రధాన కారణాలని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.

ఇది కూడా  చదవండి: ‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)