Breaking News

‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్‌ సర్టిఫికెట్‌ ఇప్పించండి’

Published on Tue, 07/11/2023 - 12:07

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక ఉదంతం చర్చనీయాంశంగా మారింది.  ఒక వితంతు వృద్ధ మహిళ మృతిచెందినట్టు నిర్థారిస్తూ ఆమెకు రావాల్సిన పెన్షన్‌ నిలిపివేశారు. ఈ నేపధ్యంలో బాదామ్‌దేవి అనే ఆ వృద్ధురాలు తన సమస్య పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. 

పెన్షన్‌ నిలిపివేసి..
తాను బతికే ఉన్నానని, తనను గుర్తించి, తనకు తిరిగి పెన్షన్‌ ఇప్పించాలని వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు పెన్షన్‌ నిలిపివేశారని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఆమె తాను బతికే ఉన్నానని, అధికారులు నిర్థారించిన విధంగానైనా తనకు డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరుతోంది. 2023 జనవరి 20న తనకు పెన్షన్‌ నిలిపివేశారని, కారణం అడిగితే చనిపోయావని అన్నారని ఆమె తన వినతిపత్రంలో పేర్కొంది. 

లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించినా..
20 ఏళ్లుగా తాను పెన్షన్‌ అందుకుంటున్నానని, అయితే ఈ ఏడాది దానిని నిలిపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఈ ఏడాది జనవరి 6న లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించానని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే తాను జీవించివున్నా ఇప్పుడు డెత్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశానన్నారు. కాగా ఆమె దరఖాస్తును చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారి సుభమ్‌ గుప్త మాట్లాడుతూ ఈ విషయమై దర్యాప్తునకు ఆదేశించామన్నారు.  
ఇది కూడా చదవండి: 16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)