Breaking News

పవన్‌ ఖేరాకు సుప్రీం కోర్టులో ఊరట

Published on Thu, 02/23/2023 - 16:04

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి  పవన్‌ ఖేరా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్‌ పార్టీ. సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పొరపాటున ఆయన నోరు జారారని, అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాడని కోర్టుకు వివరించారు పవన్‌ తరపు న్యాయవాది. దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ఢిల్లీ స్థానిక కోర్టును ఆదేశిస్తూ ఊరట ఇచ్చింది సుప్రీం.

పవన్‌ ఖేరా తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పేర్ల(దామోదరదాస్‌, గౌతమదాస్‌ అనేదానిపై) విషయంలో ఆయనకు స్పష్టత లేదు. ఆయన పొరపాటున నోరు జారారని, తప్పు ఒప్పుకున్నారని,  అందుకు క్షమాపణలు కూడా చెప్పారని సుప్రీంకు వివరించారు. మరోవైపు అసోం పోలీసుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. పవన్‌ ఖేరా అరెస్ట్‌ను ధృవీకరిస్తూ, ట్రాన్సిస్ట్‌ రిమాండ్‌ కింద కోర్టులో ప్రవేశపెడతామని సుప్రీం కోర్టుకు తెలిపారు. 

అయితే.. పవన్‌ ఖేరాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని, అందుకే కేసులు కొట్టేయమని కోరడం లేదని, కేవలం మధ్యంతర బెయిల్‌ ద్వారా ఉపశమనం మాత్రం ఇవ్వమని కోర్టును అభ్యర్థించారు పవన్‌ ఖేరా తరపున న్యాయవాది. 

దీంతో పిటిషనర్‌ తరపు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌.. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ద్వారకా కోర్టును ఆదేశించారు. ‘పిటిషనర్ (పవన్ ఖేరా) బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ తరుణంలో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలి’ అని సీజేఐ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 

అలాగే.. పవన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కలపాలని కోరుతూ పవన్‌ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. దీనికి స్పందించాలంటూ అసోం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగేంతర వరకు ఆయన మధ్యంతర బెయిల్‌ బయట స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది సుప్రీం కోర్టు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆ కామెంట్లు.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)