Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు.. చౌకలో ప్రయాణం

Published on Sat, 02/01/2025 - 12:50

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివెళుతున్నారు. ఇప్పుడు బీహార్ నుండి మహా కుంభమేళాకు వెళ్లే వారికి  బీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సు సర్వీసు ఫిబ్రవరి 28 వరకు నడుపుతున్నట్లు పేర్కొంది.  

మహా కుంభమేళా(Great Kumbh Mela)కు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఈ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపిన బీఎస్‌ఆర్టీసీ ఈ సర్వీసును రాత్రిపూట నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ బస్సు ఎక్కినవారు ఉదయానికల్లా గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించింది. మహాకుంభ్‌లో పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, రెండు కొత్త బస్సులను నడపాలని బీహార్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు బీహార్ రాజధాని పట్నా నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) వరకు నడుస్తాయి.

బీహార్‌ రాష్ట్ర రవాణా కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన ఈ బస్సుల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా  ప్రయాణించి మహా కుంభమేళాకు చేరుకోవచ్చని తెలిపారు. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు ఛార్జీ రూ. 550. ఈ బస్సు పట్నాలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం(Return journey)లో ఈ బస్సులు ప్రయాగ్‌రాజ్ నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు పట్నా చేరుకుంటాయని సంజయ్‌కుమార్‌ తెలిపారు. 

ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)