Breaking News

ఖాన్ సర్‌పై కేసు.. పోలీసుల గాలింపు

Published on Sat, 06/06/2026 - 14:44

బిహార్ రాజ‌ధాని ప‌ట్నాలో కోచింగ్ సెంట‌ర్ల ఆధిప‌త్య పోరు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఖాన్ సర్‌, రోష‌న్ ఆనంద్ మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంలో తాజాగా మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. త‌మ కోచింగ్ సెంట‌ర్‌పై రోష‌న్ ఆనంద్ దాడి చేయించాడ‌ని ఖాన్ సర్ ఆరోపించ‌గా, ఇదంతా ఖాన్ స‌ర్ ఆడిస్తున్న నాట‌క‌మ‌ని రోష‌న్ ఆనంద్ ప్ర‌త్యారోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఇప్పుడు ఖాన్ స‌ర్ వెంట ప‌డ్డారు.

పట్నా: ఖాన్ సర్‌గా ప్రసిద్ధి చెందిన ఫైసల్ ఖాన్ ఆచూకీ కోసం బిహార్‌ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయ‌న‌ను అరెస్ట్ చేసే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఫైసల్ ఖాన్‌పై హత్యాయత్నం, ఆయుధాల చట్టం (ఆర్మ్స్ యాక్ట్) కింద నమోదైన కేసు నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయ‌న కోసం గాలిస్తున్నట్టు స‌మాచారం. ఖాన్ సర్ శుక్రవారం పట్నాలోని కోర్టులో లొంగిపోయే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. ఆయన కోర్టులో హాజరవుతారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఖాన్ సర్‌ను అప్రతిష్టపాలు చేయడానికే కేసులో ఇరికించార‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయవాది అరవింద్ కుమార్ మవ్వార్ ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు. జూన్ 2న పట్నాలోని ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన విధ్వంస ఘటన నేపథ్యంలో ఫైసల్ ఖాన్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 15 నుంచి 20 మంది వ్యక్తులు  కోచింగ్ సెంటర్‌పై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లు రువ్వారు.

అల్లర్ల సమయంలో ఖాన్ సర్ విద్యాసంస్థ‌కు చెందిన‌ ఇద్దరు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో పట్నాలోని కదమ్‌కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఖాన్ సర్‌తో సహా ముగ్గురు వ్యక్తులపై బీఎన్ఎస్‌ సెక్షన్ 109, ఆయుధ చట్టంలోని సెక్షన్లు 25(9), 27, 35 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు గార్డులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఖాన్ స‌ర్‌ను కూడా అదుపులోకి తీసుకోవాల‌ని పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ఆరోపణలు
ఇదిలా ఉండగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ప్రతినిధులు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. విధ్వంస ఘటనను ఖాన్ సర్ స్వయంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు వెల్లడించారు. కాగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థకు చెందిన వ్యక్తులే త‌మ కోచింగ్ సెంట‌ర్‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని మొద‌ట ఖాన్ సర్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 

చ‌ద‌వండి:  ఖాన్ స‌ర్‌.. గొడ‌వ‌లొద్దు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు