Breaking News

చిదంబరం అడిగిన ప్రూఫ్‌ ఇదిగో: అమిత్‌షా

Published on Tue, 07/29/2025 - 12:31

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చ సాగుతోంది. ఆపరేషన్‌ మహాదేవ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. పాక్‌ రెచ్చిపోయి సరిహద్దులో హిందూ ఆలయాలు, సామాన్యులను టార్గెట్‌ చేసిందని.. ఆపరేషన్‌ మహాదేవ్‌తో పహల్గామ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు.

పహల్గామ్‌లో కుటుంబ సభ్యుల ముందే చంపేశారు. టెర్రరిస్టులు ఉగ్రదాడి తర్వాత పాక్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వలేదు. నిన్న జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్‌ మహాదేవ్‌ జరిగింది. ఆపరేషన్‌ మహాదేవ్‌లో సులేమాన్‌ మూసా హతమయ్యాడు. ముగ్గురిలో ఒకరు ఎల్‌ఈటీ ఉగ్రవాది సులేమాన్‌గా గుర్తించాం. ఈ సులేమాన్‌ పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

‘‘చిదంబరం ప్రూప్‌ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్‌ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు పాక్‌కు చెందిన వారు. ఉగ్రవాదులు దగ్గర పాక్‌లో తయారైన చాకెట్లు దొరికాయి. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్‌ వివరాలూ ఉన్నాయి. చిదంబరం పాక్‌కు క్లీన్‌చిట్‌ ఎందుకుఇచ్చారు?’’ అంటూ అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పహల్గామ్‌ టెర్రిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా.. కానీ చూస్తుంటే విపక్షాలు హ్యాపీగా లేవనిపిస్తోంది. పాక్‌ను రక్షిస్తే చిదంబరానికి వస్తుంది? అంటూ అమిత్‌షా మండిపడ్డారు.

కమ్యూనికేషన్‌  డివైజ్‌ను ట్రాక్‌ చేయడంద్వారా ఉగ్రగుట్టును పసిగట్టాయి. జమ్మూకశ్మీర్‌ ోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఇది మోదీ సర్కార్‌ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. యూపీఏ హయాంలో తప్పించుకున్న ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులు ప్రాణాలతో దేశం వెళ్లరని ఆ మరుసటి రోజే చెప్పాం’’  అని అమిత్‌షా గుర్తు చేశారు.

లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ..
 

 

 

 

 

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)