Breaking News

భార్య కోసం వెయిటింగ్‌.. కార్‌లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసిన చిన్నారి.. చివరికి

Published on Fri, 07/21/2023 - 11:51

పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చేసే అల్లరి, తెలియక చేసే కొన్ని పనులు వాళ్లని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పిల్లలతో బయటకు వెళ్తే..కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. సరదాగా షికారుకు వెళ్లినప్పుడు.. చిన్నారులు కార్‌లోకి వెళ్లి లోపల నుంచి లాక్‌ వేసుకోడం కొత్తేమి కాదు. కార్ల తయారీదారులు సెంట్రల్ లాకింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.

పంజాబ్‌లోని లూథియానాలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన భార్య, పిల్లాడి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో తన రెండో కుమారుడు ( 3 సంవత్సరాలు) అతని చేతిలో నుంచి కారు కీ లాక్కొని వాహనంలోకి ప్రవేశించాడు. అనంతరం కార్‌ డోర్‌ వేయడంతో పాటు కొన్ని సెకన్లలో, కారు లాక్ అవుతుంది. కార్‌ డోర్‌లు అన్నీ లాక్‌ అవడంతో.. ఆ తండ్రి తన కొడుకుతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి.. అన్‌లాక్ బటన్‌ను నొక్కమని అడిగాడు.

అయినప్పటికీ, పిల్లవాడు గందరగోళానికి గురవడంతో అనుకోకుండా అన్‌ లాక్‌ బటన్‌ను అనేకసార్లు నొక్కడంతో  కారులోని అలారం యాక్టివేట్‌ అవుతుంది. దీంతో చిన్నారి ఏడవడంతో స్థానికులు గుమిగూడారు. చివరికి అనేక ప్రయత్నాల తరువాత, వారు సుత్తితో వెనుక క్వార్టర్ గ్లాస్‌ను పగలగొట్ట.. పిల్లవాడిని కారులోంచి బయటకు సురక్షితంగా రక్షించుకోగలిగారు. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ విషయాన్ని అతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.
 



చదవండి   దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. వామ్మో అన్ని ఆస్తులు ఉన్నాయా!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)