Breaking News

‘కూటమిలో పప్పు, తప్పు, అప్పు’: సీఎం యోగి

Published on Mon, 11/03/2025 - 13:28

దర్భంగా: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం బీహార్‌లోని దర్భంగాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌, ఆర్జేడీల పనితీరును దుయ్యబట్టారు. వారి పాలనలో రాష్ట్రంలో ఏమి జరిగిందో గుర్తు చేశారు.

ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిపై విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టిన సీఎం యోగి.. వారి గత పాలనలో పేదలకు ప్రాథమిక అవసరాలు, సంక్షేమ ప్రయోజనాలు అందకుండా పోయాయని ఆరోపించారు. 2005కి ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలోని పేదలు అనారోగ్యానికి గురైతే, వైద్య సదుపాయాలు లేక బాధపడుతూ చనిపోయేవారని అన్నారు. మహాత్మాగాంధీ చెప్పిన మూడు కోతులు కథను గుర్తు చేస్తూ,  నేడు ఇండియా కూటమిలో పప్పు, తప్పు, అప్పు అనే మూడు కొత్త కోతులు ఉన్నాయన్నారు. వాటి గుణాలను వివరిస్తూ పప్పు నిజం మాట్లాడలేడని, తప్పు సరైనది చూడలేడని, అప్పు నిజం వినలేడని అ‍న్నారు. ఈ నేతలు ఎన్‌డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను చూడలేరు, వినలేరు, మాట్లాడలేరని, అందుకే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని యోగి  ఆరోపించారు.

కశ్మీర్‌ను కాంగ్రెస్ వివాదాస్పదం చేసిందని, అయితే ప్రధాని మోదీ దానిని ఉగ్రవాదం నుండి విముక్తి చేశారని సీఎం యోగి పేర్కొన్నారు. హిందువులు కశ్మీర్‌ను విడిచి వెళ్లాల్సి రావడం వెనుక కాంగ్రెస్ తప్పిదముందని, ఇప్పుడు మిథిల, బీహార్ ప్రజలు కూడా అక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు రామునికి వ్యతిరేకం అని, హిందూ విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నాయని సీఎం ఆరోపించారు. 
రామ రథయాత్రను ఆపేందుకు ఆర్జేడీ ప్రయత్నించిందని, అయోధ్యలో రామ భక్తులపై కాల్పులు జరపాలని సమాజ్ వాదీ పార్టీ ఆదేశించిందని, పవిత్ర నగరాన్ని రక్తంతో ఎర్రగా మార్చారని యోగి ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో బీహార్‌లో 70కి పైగా మారణహోమాలు జరిగాయన్నారు. ఈ పార్టీలు ప్రజలను కులాల వారీగా విభజించి, జాతీయ భద్రతను బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)