ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు

Published on Mon, 08/03/2026 - 10:56

ముంబై: మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది. టీఈటీ పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బ్రిజేంద్ర గుప్తాతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా ఒక్క టీఈటీ పేపర్ లీకేజీతో ఆగకుండా, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే ‘సెట్’ పరీక్షా పత్రాన్ని కూడా లీక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆగ్రాలోని ఓ ముద్రణాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ శర్మ ద్వారా ఈ పత్రాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల ద్వారా ఈ ముఠాలు ఏవిధంగా ప్రశ్నపత్రాలను తస్కరిస్తున్నాయనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లలో నిఘా ఉంచి, కిందిస్థాయి సిబ్బందిని ఆకర్షించి పత్రాలను బయటికి పంపడం, అలాగే ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను దక్కించుకుని వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం వంటి పద్ధతులను ఈ నెట్‌వర్క్ వాడుతున్నట్లు తేలింది.

టీఈటీ పరీక్షా పత్రాన్ని రూ. 8,000 పెట్టి కొనుగోలు చేసిన ఈ ముఠా, మహారాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు రూ. 80,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. భివాండి నగరంలో ఈ పేపర్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో థానే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి హరియాణా, బిహార్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు
 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)