Breaking News

ఎన్నికల్లో నామినేషన్‌ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే!

Published on Fri, 06/16/2023 - 09:30

సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్‌ అంటే చుట్టూ జనాలు, పదుల సంఖ్యలో వాహనాలు.. ఓ వేడుకను తలపిస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా 22 కి.మీ పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేశాడు. అయితే తాను ఈ పద్ధతినే ఎంచుకోవడం వెనుక ఓ కారణముందని చెబుతున్నాడు. అదేంటంటే.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల 2023 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

అందుకే 22 కి.మీ పరగు
డార్జిలింగ్ జిల్లాలోని సొనాడ గ్రామ పంచాయతీకి చెందిన తుమ్సోంగ్ ఖాస్మహల్ నివాసి అయిన సనారా సుబ్బా ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక డార్జిలింగ్‌లో కొండ ప్రాంతంలోని గ్రామంలో రోడ్లు కూడా సరిగా ఉండవు, ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో 22 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు.

ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. తన గ్రామంలోని రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని.. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతన్ని పర్వత సానువులలో అనేక కిలోమీటర్లు స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. పర్యావరణ కాలుష్యం పర్వతాలను కూడా ప్రభావితం చేసిందని.. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిందని తెలిపాడు.ట్రాఫిక్‌ జామ్‌తో కొండవాలు, పర్యాటకులు కూడా నానా అవస్థలు పడుతున్నారని.. అయితే రాజకీయ పార్టీలకు వాటి గురించి ఆలోచించే సమయం లేదని వాపోతున్నాడు.

చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)