Breaking News

పాకిస్తాన్‌ అధికారుల ఓవరాక్షన్‌.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్‌ సంబరాలు?

Published on Thu, 04/24/2025 - 12:14

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్‌ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్‌ హైకమిషన్‌ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్‌ కట్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్‌ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లోకి అక్కడ పనిచేసే ఓ కేక్‌ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్‌ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ ప్రతినిధులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్‌ హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)