Breaking News

బ్రహ్మోస్‌ మిసైల్‌తో పాక్‌ను దారికి తెచ్చిన భారత్‌?

Published on Sun, 05/11/2025 - 09:45

ఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్‌తో పాకిస్థాన్‌ను భారత్‌ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్‌ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది.

అణు ఆయుధ కేంద్రాలను భారత్‌ టార్గెట్‌ చేసుకోవచ్చనే భయంతో అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్‌ చేసింది. మే 10న తెల్లవారు జామున, భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా,  పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా వద్ద బ్రహ్మోస్-ఏ క్షిపణులతో దాడులు చేసింది.

కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్‌ పంచ్‌ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్‌ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది.

అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్‌ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్‌ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది.

 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)