Breaking News

ఐఏఎస్‌ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ క్షమాపణలు

Published on Tue, 05/27/2025 - 14:14

బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్‌ రవికుమార్‌ ఐఏఎస్‌ అధికారిణి ఫౌజియా తరణమ్‌(Fouzia Taranum)కు క్షమాపణలు చెప్పారు. ఆమె పాకిస్తాన్‌ నుంచి వచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అక్కడ. అయితే.. 

తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్య చేయలేదంటూ మంగళవారం ఆయన క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో ేనేను భావోద్వేగంలో ఉన్నా. మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా అని ఎన్డీటీవీతో ఎన్‌ రవికుమార్‌(N Ravikumar) అన్నారు.

అసలేం జరిగిందంటే..
బీజేపీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి(Chalavadi Narayanaswamy)  ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే(ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ..  ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్‌ హౌజ్‌ వద్ద నిరసనలు తెలిపారు. అయితే.. 

అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్‌‌ ఫౌజియా తరణమ్‌ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్‌ పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు.ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్‌ ఇక్కడ ఐఏఎస్‌ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్‌ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్‌ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్‌ వ్యాఖ్యానించారు.

మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్‌లో ఫిర్యాదు నమోదుకాగా.. రవికుమార్‌పై కేసు ఫైల్‌ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్‌ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, రవికుమార్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆరా తీస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మీడియాకు వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)