Breaking News

కొత్త సంవత్సరం వేళ : ఎల్‌వోసీ వద్ద పాక్‌ డ్రోన్‌ కలకలం

Published on Thu, 01/01/2026 - 15:40

భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి  పాకిస్తాన్‌ మరోసారి తన దుర్బుద్ధిని చాటుకుంది. గురువారం పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ప్రమాదకరమైన పదార్థాలతో నిండిన బ్యాగ్‌ను భారత సైన్యం చ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానవరహిత వైమానిక వాహనం భారత గగనతలంలోకి ప్రవేశించి ఐదు నిమిషాలకు పైగా ఉండి, చక్కన్ దా బాగ్ ప్రాంతంలోని రంగర్ నల్లా, పూంచ్ నది సమీపంలో దాని పేలోడ్‌ను పడవేసిందని అధికారులు తెలిపారు. ఇందులోఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి), మందుగుండు సామగ్రి, మాదక  ద్రవ్యాలున్నాయని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ  వెంబడి ఖాదీ కర్మదా ప్రాంతంలో భారత భూభాగంలోకి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్  కొన్ని  అనుమానిత పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను జారవిడిచింది. ఇవి ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలో భద్రతా సమస్యలను లేవనెత్తింది. 

ఇదీ చదవండి: స్మోకింగ్‌ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి?


 

ify">  డ్రోన్ కదలికను గుర్తించిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఖాదీ కర్మదా , పరిసర ప్రాంతాలలో విస్తృతమైన కార్డన్  సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అదనంగా, భద్రతా దళాలు పఠాన్‌కోట్-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట కథువా, సాంబా, జమ్మూ, ఉధంపూర్ జిల్లాల్లోని వాహన తనిఖీలను ముమ్మరం చేశాయి. నూతన సంవత్సర వేడుకలకు ముందు జమ్మూ ప్రాంతం అంతటా భద్రతను పెంచిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్‌ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు

 

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)