Breaking News

భారత్‌పై సైబర్‌ దాడికి  పాక్‌ హ్యాకర్ల యత్నాలు 

Published on Sun, 05/11/2025 - 03:41

సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్‌ దాడికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, ఈమెయిల్‌ల ద్వారా ‘డ్యాన్స్‌ ఆఫ్‌ హిల్లరీ’అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేయాలని చూస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించాయి. 

పాక్‌ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్‌ను అభివృధ్ధి చేసినట్లు సమాచారం. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను దొంగిలించేందుకు ఈ మాల్‌వేర్‌ను వీడియోలు, పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో పంపిస్తోంది. ఈ వైరస్‌ ఒక్కసారి యాక్టివేట్‌ అయిందంటే మొబైల్‌ పరికరాలను, కంప్యూటర్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంక్‌ సమాచారం, పాస్‌వర్డ్‌ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదముందని ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

‘.exe', "tasksche.exe' వంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్‌ ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైళ్లు సాధారణమైనవిగానే కనిపించినా, చాలా హానికరమైనవని, ఒకసారి క్లిక్‌ చేసిన తర్వాత, అవి హ్యాకర్లకు రిమోట్‌ యాక్సెస్‌ను ఇచ్చేస్తాయని చెబుతున్నారు. డిజిటల్‌ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్‌ మీడియా ట్రెండ్‌లను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్‌ సెల్‌లను కేంద్రం అప్రమత్తం చేసింది.   
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)