Breaking News

Jammu and Kashmir: ఆర్మీ పోస్ట్‌పై పాక్ దాడి విఫలం.. సైనికుడు మృతి

Published on Wed, 08/13/2025 - 11:17

బారాముల్లా : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోగల ఉరి సెక్టార్ లో భారత సైన్యం పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, పాక్‌ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడు  మృతిచెందాడు. 

బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్‌ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి.
 

పాక్‌ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో పరస్పరం జరిగిన జరిగిన కాల్పుల్లో హవల్దార్ అంకిత్, సైనికుడు బానోత్ అనిల్ కుమార్ గాయాల పాలయ్యారు. వీరిలో బానోత్ అనిల్ కుమార్ ప్రాణాలు విడిచారని ఆర్మీ అధికారులు ‘ఎక్స్‌’ పోస్టులో తెలిపారు. ‘జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిపాయి బానోత్ అనిల్ కుమార్‌కు  భారత సైన్యం వందనాలు అర్పిస్తున్నది. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.మృతుల కుటుంబానికి సంఘీభావం తెలుపుతోందని’ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)