Breaking News

Amritpal Singh-Engineer Rashid: జైలు నుంచి గెలుపు.. ఎంపీలుగా ప్ర‌మాణం

Published on Fri, 07/05/2024 - 17:16

జైలు నుంచి  ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఇద్ద‌రు ఎంపీలు శుక్ర‌వారం పార్ల‌మెంట్‌ సభ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే నేత అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. త‌న‌తో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్‌ రషీద్‌ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

అమృత్‌పాల్‌ సింగ్‌ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే.  లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్‌ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక రషీద్‌ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

 

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)