Breaking News

అదానీ–సెబీ చైర్‌పర్సన్‌ ఉదంతంపై... జేపీసీతో దర్యాప్తు

Published on Mon, 08/12/2024 - 05:48

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో సెబీ చైర్‌పర్సన్‌ మాధబీ పురీ బచ్‌ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్‌ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్‌లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌వర్గ్‌ తాజాగా ఆరోపించడం తెలిసిందే. 

అదానీ గ్రూప్, సెబీ చైర్‌పర్సన్‌ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.

 ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్‌ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్‌ చేశారు. సెబీ చైర్‌పర్సన్‌–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్‌ (కాంగ్రెస్‌), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్‌) ఆరోపించారు. అదానీ గ్రూప్‌ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. 

విపక్షాల కుట్ర: బీజేపీ 
దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ  కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)