Breaking News

ఆపరేషన్‌ షీల్డ్‌ వాయిదా

Published on Thu, 05/29/2025 - 09:21

న్యూఢిల్లీ: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ(మే 29న) సాయంత్రం చేపట్టాల్సిన ఆపరేషన్‌ షీల్డ్‌(Operation Shield) వాయిదా పడింది. గుజరాత్‌, రాజస్థాన్‌, ఛండీగఢ్‌, జమ్ము, హర్యానాలో పౌర రక్షణ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే.. పాలనాపరమైన కారణాల వల్ల దానిని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించే ప్రయత్నది. ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు.. మే 7వ తేదీన తొలిసారి పౌర రక్షణ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. ఇవాళ మరోసారి సాయంత్రం 5గం.లకు గుజరాత్‌, రాజస్థాన్‌, ఛండీగఢ్‌, జమ్ము, హర్యానాలో రెండోసారి నిర్వహించాలనుకున్నాయి. అయితే..

హర్యానా తప్పించి మిగతా రాష్ట్రాల్లో ఆపరేషన్‌ షీల్డ్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రానికే హోం శాఖ ప్రకటించింది. కానీ, హర్యానా కూడా వాయిదాకే మొగ్గు చూపించడంతో తాజా ప్రకటన చేశారు. అధికారిక కారణాల వల్ల  మాక్‌ డ్రిల్స్‌ వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని కేంద్ర హోం శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్‌ డ్రిల్స్‌(Mock Drills) నిర్వహించింది. సైరన్‌ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం.. భద్రతా బలగాలు వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఇందులో ఉంటాయి. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టడం గమనార్హం. 

చివరిసారిగా.. 
1971లో తూర్పు పాకిస్థాన్‌(ప్రస్తుత బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్థాన్‌లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు.  అయితే.. కార్గిల్‌ యుద్ధం అప్పుడు జరిగినా.. అవి సరిహద్దు జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి.

ఇదీ చదవండి: శాంతిని మేం బలంగా కోరుకుంటున్నాం-పాక్‌ ప్రధాని

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)