amp pages | Sakshi

సీబీఐ అప్పుడు నాపై ఒత్తిడి చేసింది: అమిత్‌ షా

Published on Thu, 03/30/2023 - 12:40

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తు‍న్న విమర్శలపై ఆయన స్పందించారు.  యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన. 

బుధవారం ఓ మీడియా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్‌ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్‌ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన. 

కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన. 

ఇక రాహుల్‌ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్‌.. కాంగ్రెస్‌ చీఫ్‌ ఎద్దేవా

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌