Breaking News

‘ప్రధాని మోదీ నా కుమారుడు.. ఆయనకు నా ఆస్తి రాసిస్తా’

Published on Tue, 06/27/2023 - 14:01

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమ్మ ఇటీవలే చనిపోయారు. ఆమెకు చేయాల్సిన అన్ని ఖర్మక్రతువులను మోదీ దగ్గరుండి చేయించారు. ఇప్పుడేమో మరో అమ్మ తెరపైకి వచ్చింది. ఇదేంటి అనుకుంటున్నారా? అసలు కథేంటంటే.. మంగీబాయికి వయసు 100 ఏళ్లు. ఆమెకు 14 మంది పిల్లలు ఉండగా.. మోదీని తన 15వ కొడుకుగా భావిస్తున్నానని చెప్పింది. ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తనవంటి వారి కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. మోదీకి మాత్రమే ఓటేస్తానని ఆమె వెల్లడించారు. 

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపురా గ్రామానికి చెందిన ఆ వృద్ధురాలు మంగీబాయి తన్వర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ప్రధాని మోదీ దేశానికి చాలా చేస్తున్నారని, తన కోసం కూడా చాలా చేశారని అన్నారు. అయన తనలాంటి వృద్ధులకు ఆహారం, వసతి వంటివి కల్పించారని చెప్పారు. 'మోదీ నాకు ఇల్లు ఇచ్చారు.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.. వితంతు పింఛన్‌ ఇస్తున్నారు, ఆర్థికంగా ఆదుకుంటున్నారు. 

ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగాను.. అందుకే నా కొడుకు. అవకాశం దొరికితే స్వయంగా ప్రధానిని కలవాలనుకుంటున్నాను’’ అని మంగీబాయి చెప్పింది. తన పేరున ఉన్న 25 బిగాస్‌ (15 ఎకరాల) భూమిని ప్రధానికి రాసిస్తానని 100 ఏళ్ల బామ్మ చెప్పడం సంచలనంగా మారింది. మంగళవారం మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటించనున్న సందర్భంగా ఈ వీడియో వైరల్‌గా మారడం గమనార్హం. 

చదవండి: మహారాష్ట్ర వేదికగా బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)