Breaking News

వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి

Published on Sun, 03/09/2025 - 07:23

జైపూర్‌: ఓ యువతి ఫోన్‌ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే ఆమెకు శాపమైంది. దాదాపు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమెకు వెంటాడి మరీ గాయపరిచాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అల్వర్‌ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. అల్వర్‌లోని జేకే నగర్‌కు చెందిన నవ్య ఫోన్‌ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చింది. ఫోన్‌ మాట్లాడుకుంటూ అలా కొంత దూరం ముందుకు నడిచింది. ఈ క్రమంలో 10-12 కుక్కలు అకస్మాత్తుగా ఆమెపైకి వచ్చి దాడి చేశాయి. అనంతరం నవ్య పరుగులు తీస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపై దాడి చేయడం వల్ల నవ్య కింద పడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదలకుండా ఆమెపై దాడి చేశాయి.

ఈ సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వారు, స్కూటీపై వెళ్తున్న మహిళ వెంటనే స్పందించి కుక్కలను తరిమేశారు. దీంతో, నవ్యపై దాడిని ఆపేసి పారిపోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటన తర్వాత బాధితురాలు, ఫిజియోథెరపీ చదువుతున్న నవ్య మాట్లాడుతూ.. కుక్కల దాడి కారణంగా చాలా భయపడినట్లు చెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని వెల్లడించింది. పలుచోట్ల గాయాలైనట్టు తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఈ ఘటన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ మహిళను స్థానికులు మందలించారు. వీధి కుక్కల దాడులు పెరగడానికి ఇదే కారణమని చెప్పారు. గత ఐదేళ్లుగా వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ ప్రాంత కౌన్సిలర్ అన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులో అనేకసార్లు లేవనెత్తానని, కానీ ఎటువంటి పరిష్కారం చూపించలేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)