Breaking News

శబరిమల: ఎయిర్‌పోర్టు పనులకు ముందడుగు

Published on Sat, 12/20/2025 - 16:22

కేరళ, ఎరుమేలిలో కేంద్రం నిర్మించబోయే శబరిమల గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు పనులలో ముందడుగు పడింది. విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ, పరిహార అంచనా తదితర పనులను సంబంధిత రెవెన్యూశాఖ ప్రారంభించింది. రెవిన్యూ అధికారులు స్థలసేకరణ, భవనాలు, చెట్లు తదితర పరిహారానికి సంబంధించిన వివరాలను  సేకరిస్తున్నారు.

ఏటా అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున కేరళకు వస్తుంటారు. అయితే  భక్తుల సౌకర్యం దృష్ట్యా స్వామివారి దర్శనానికి భక్తులకు దగ్గరగా ఉండే విధంగా ఎరుమలిలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా అధికారులు దానికి సంబంధించి స్థల సేకరణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చెరువల్లి ఎస్టేట్లో భూమిసేకరణలో భాగంగా చెట్లు, భవనాల విలువని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ ప్రాంతంలో మెుత్తం 916.27 హెక్టార్లు భూమి సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో  121.876 హెక్టార్లు స్థలంలో భవనాలు, నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. వాటి విలువ సేకరించిన అనంతరం పరిహారం నిర్ణయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళలో కేంద్రం ప్రతిపాదించిన శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలైలో ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.7,047 కోట్లు కాగా నిర్మాణం కోసం ఎరుమెలి,చెరువల్లి ఎస్టేట్‌లలో 2,570 ఎకరాల భూమి అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు భూమి సేకరణ పనులు ప్రారంభించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)