Breaking News

కూర వండాడు.. జైలు పాలయ్యాడు

Published on Fri, 08/22/2025 - 10:36

భువనేశ్వర్‌: ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి. నేటి తరం యువతలో ఈ తపన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ అత్యుత్సాహంతో, చట్టం, నైతికత, సమాజం పట్ల బాధ్యతను విస్మరించి విస్మరించి ప్రవర్తిస్తున్నారు.  ఇలా ప్రవర్తించిన ఓ యూట్యూబర్‌ జైలు పాలయ్యాడు.  

సాంస్కృతికంగా, చారిత్రికంగా, ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన రూప్‌ నాయక్‌ అనే యూట్యూబర్‌ ఓ వీడియో కారణంగా జైలు పాలయ్యాడు. మయూర్భంజ్ జిల్లాకు చెందిన రూప్ నాయక్  తన అత్తింటి నుండి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో అతడికి రోడ్డు పక్కన మానిటర్ లిజర్డ్ (Monitor Lizard ఉడుము) దొరికింది. దానిని ఇంటికి తీసుకెళ్లి, మాంసం వండాడు.

అంతేకాదు, ఉడుము మాంసం కూర ఎలా వండాలి? ఎలాంటి దినుసులు వేయాలో మొత్తం సవివరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ వీడియో ఒక్కసారిగా వైరలైంది. వైరలైన వీడియో గురించి అటవీ శాఖకు సమాచారం అందింది.

ఇంకేం  జంతు సంరక్షణ యాక్ట్‌ 1972 కింద అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడికి కోర్టు రిమాండ్‌ విధించింది. కాగా, అటవీ జంతువులను వేటాడటం, చంపడం, లేదా తినడం చట్టపరంగా తీవ్రమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా సైతం చెల్లించాల్సి ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)