Breaking News

Odisha: ప్రాణాలొదిలిన వేధింపుల బాధితురాలు.. స్పందించిన సీఎం

Published on Tue, 07/15/2025 - 07:15

భువనేశ్వర్‌: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌పై  ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో  కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.

ఐసీయూలోని  బర్న్స్  వార్డులో  చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.
 

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్‌ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి  ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను.  ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్‌లైన్ పోస్ట్‌లో తెలిపారు.
 

#

Tags : 1

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?