‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!

Published on Sat, 06/20/2026 - 12:17

భువనేశ్వర్‌: నీట్-యూజీ (NEET-UG) రీటెస్ట్ రాయబోతున్న ఒక ఒడిశా విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. జూన్ 21న పరీక్ష జరగనుండగా, కేవలం ఒక్క రోజు ముందు ఆమెకు దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్‌కు చెందిన డెహ్రాడూన్‌లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మొదట భువనేశ్వర్‌లో సెంటర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడు రీటెస్ట్ అడ్మిట్ కార్డ్‌లో డెహ్రాడూన్ అని మార్చడంతో ఆ విద్యార్థిని, ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, విద్యార్థిని భవిష్యత్తును కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

భువనేశ్వర్ టు డెహ్రాడూన్
ఈ తప్పిదాన్ని ‘వెటరన్స్ క్లబ్ ఒడిశా’ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు విద్యార్థిని మొదట రాసిన నీట్ పరీక్షకు భువనేశ్వరే కేంద్రంగా ఉంది. కానీ, రీటెస్ట్ కోసం జారీ చేసిన కొత్త అడ్మిట్ కార్డ్‌ను చూసి ఆ కుటుంబం నిర్ఘాంతపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో అంత దూరం ప్రయాణించడం ఆర్థికంగా, ప్రాక్టికల్‌గా అసాధ్యమని, దీనివల్ల విద్యార్థిని పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యాయం కోసం మాజీ సైనికుడి పోరాటం
బాధిత విద్యార్థిని తండ్రి, మాజీ సైనికుడు సంజయ్ బిస్వాల్ ఈ తప్పిదంపై ఇండియన్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ ఒడిశా విభాగంతో పాటు ఇతర ఉన్నతాధికారులకు అత్యవసర అప్పీళ్లు సమర్పించారు. తన కుమార్తెకు స్వరాష్ట్రంలోనే లేదా ఇంటికి దగ్గరగా ఎక్కడైనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని ఆయన అభ్యర్థించారు. పరీక్ష సమయం ముంచుకొస్తున్న తరుణంలో, ఈ ఆకస్మిక మార్పు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది.

ఒకవైపు ఉచిత రవాణా.. మరోవైపు అందని స్పందన
మరోవైపు, ఒడిశా ప్రభుత్వం నీట్ రీటెస్ట్ రాసే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాలను ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే 26 కేంద్రాలకు గానూ 108 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా సాయం అందిస్తున్నా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ఈ పొరపాటు కారణంగా ఒక విద్యార్థిని ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై నేషనల్  టెస్టింగ్‌ ఏజెన్సీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)