Breaking News

Odisha Bandh: విద్యార్థిని ఆత్మాహుతికి నిరసనల వెల్లువ

Published on Thu, 07/17/2025 - 10:38

భువనేశ్వర్: ప్రిన్సిపాల్‌ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విద్యార్థినికి ‍ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఒడిశాలో ఈరోజు(గురువారం) బంద్‌ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని భువనేశ్వర్‌లోని దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు కూడా కనిపించలేదు.

రాష్ట్రవ్యాప్త బంద్‌ పిలుపునకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు.. ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు, ప్లకార్డులను పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. బంద్‌ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలను మోహరించడంతో పాటు  గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ  ఈ బంద్ రాజకీయాల కోసం కాదని, ఇక్కడి కుమార్తెలకు అండగా నిలిచేందుకేనని అన్నారు. ఇటువంటి నిరసన లేకపోతే ప్రతీ పాఠశాల, కళాశాలలో ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై  న్యాయ విచారణకు సీపీఐ(ఎం) నేత సురేష్ పాణిగ్రాహి పిలుపునిచ్చారు.
 

బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తాను కళాశాల విభాగాధిపతి నుంచి దీర్ఘకాలంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతురాలి తండ్రితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ ఘటన సమాజానికి అయిన గాయంగా రాహుల్‌ అభివర్ణించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)