పెళ్లి పీటలెక్కబోతున్న లవ్‌బర్డ్స్‌: హాట్‌టాపిక్‌గా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌

Published on Sat, 01/03/2026 - 19:27

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధపడుతోంది. సోషల్‌ మీడియా వేదికగా తనప్రియుడు  ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో ఎంగేజ్‌మెంట్ వార్తను అధికారికంగా ప్రకటింది. దీంతో  ఈఫోటోలు నెట్టింట సందడిగామారాయి.  2023 నుండి డేటింగ్‌లో ఉన్న  ఈ జంట  జనవరి 3న  తన రిలేషన్‌ షిప్‌ను అధికారికంగా ప్రకటించాయి.  రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్లో అత్యంత ఘనంగా జనవరి 11 పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందర్బంగా నూపుర్ తన నిశ్చితార్థపు విశేషాలు ఆసక్తికరంగా మారాయి. నూపుర్‌ భారీ నిశ్చితార్థపు ఉంగరం ధర ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. స్టెబిన్ తన ప్రియురాలు నూపుర్ కోసం ఉత్తమమైన ఉంగరం కోసం  పెద్ద రీసెర్చే చేసి  ఉంటాడని భావిస్తున్నారు.  


నూపుర్ సనన్ భారీ నిశ్చితార్థపు ఉంగరం ధర ఎంత?
 ఎప్పటిలాగా రౌండ్‌గా గాకుండా ఉన్న క్లాసీ మార్క్విస్ ఉంగరం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎంగేజ్‌మెంట్‌ కోసం కాబోయే వధువుకు సాధారణంగా  గుండ్రని, ప్రిన్సెస్-కట్ డైమండ్ ఉంగరాలతో నిండిన ఈ ప్రపంచంలో, స్టెబిన్ బెన్ ఒక మార్క్విస్-కట్ నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎంచుకోవడం విశేషం.  కొన్ని నివేదికల ప్రకారం మధ్యలో ఉన్న వజ్రం 0.8 అని కొందరు వాదిస్తున్నప్పటికీ, 4 క్యారెట్లు అని  పలు నివేదిలు పేర్కొంటున్నాయి. అన్నట్టు మార్క్విస్-కట్ నిశ్చితార్థపు ఉంగరాలకు  రాయల్‌ లుక్‌కి  ప్రతీకగా నిలుస్తాయి. యూరోపియన్ రాజరిక కాలంలో ఇవి ప్రాచుర్యం పొందాయి. దీంతో స్టెబిన్‌ సౌందర్య ప్రియత్వంపై ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇదీ చదవండి: జంక్‌ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!

మధ్యలో ఉన్న వజ్రానికి ఇరువైపులా రెండు క్లాసీ వజ్రాలు  కూడా ఉన్నాయిజ ఈ ఉంగరం ఖచ్చితంగా ప్రకృతి మూలకాల నుండి ప్రేరణ పొంది తయారు చేశారని అంచనా. మిస్‌మాలిని ప్రకారం, మధ్యలో ఉన్న వజ్రం 4 క్యారెట్ల బరువు ఉంటే, ఆ ఉంగరం ధర సుమారు రూ. 8,32,000 ఉండవచ్చని భావిస్తున్నారు.

నుపుర్- బెన్ 
నుపుర్ సనన్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' (2023) సినిమాతో నుపుర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బి ప్రాక్ పాడిన 'ఫిలాల్' వంటి సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో  కనిపించడంతోపాటు ఒక ఆంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. రొమాంటిక్ సాంగ్స్‌కు ఇతను పెట్టింది పేరైన స్టెబిన్ బెన్ బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరిగా  ఖ్యాతి గడించాడు.

ఇదీ చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)