విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి.. ఇన్ని రాష్ట్రాల్లో నిరసనలు

Published on Mon, 07/27/2026 - 17:02

కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల విద్యామంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అంశం ఒక్క పరీక్షకే లేదా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నో పరీక్షలతో ఈ విషయం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి.

లక్నోలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనల్లో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేశారని, ఇలాంటి ఆరోపణలు వచ్చిన రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు అదే విధంగా బాధ్యత వహించి, వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు అంటున్నారు.

పంజాబ్‌లో రెండుసార్లు నిర్వహించిన ప్రభుత్వ నియామకాల అంశంపై కూడా రాజకీయ వేడి పెరిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలి దళ్ పార్టీలు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నిలదీస్తున్నాయి.

పంజాబ్‌లో వరుసగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, హైటెక్ పద్ధతిలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ జరగలేదని, సమయానికి నకలు మాఫియాను బయటపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఫార్మసీ విభాగం, వ్యవసాయ శాఖకు చెందిన రెండు కేసుల చుట్టూనే ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసుల వల్ల పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.

ఫార్మసీ ఆఫీసర్ పరీక్ష: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 454 ఫార్మసీ ఆఫీసర్ల నియామకానికి ఇటీవల బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో సుమారు 7,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసుల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, కోట్ కపూరా పరీక్ష కేంద్రాలపై దాడులు చేశాయి.

ఈ ఘటనలో 28 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులు తలపాగా, సాక్స్, లోదుస్తుల్లో చిన్న బటన్లు, వైర్‌లెస్ బ్లూటూత్ పరికరాలు దాచుకుని వచ్చారు. ఫిరోజ్‌పూర్‌లోని ఒక పరీక్ష కేంద్రం నుంచి పెన్ కెమెరాతో ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా బయటకు పంపారు. అక్కడ హరియాణా, రాజస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కంట్రోల్ రూమ్ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చెబుతున్నారు.

ఈ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి 3.5 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం. దీన్ని నేరుగా ప్రశ్నపత్రం లీక్, వ్యవస్థ వైఫల్యంగా పేర్కొంటూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి, విద్యామంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఇది పరీక్షకు ముందు జరిగిన ప్రశ్నపత్రం లీక్ కాదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత రియల్ టైమ్‌లో జరిగిన హైటెక్ లీక్‌ అని, దాన్ని సమయానికి గుర్తించి అడ్డుకున్నామని పంజాబ్ పోలీసులు, అధికారులు చెబుతున్నారు.

వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షలో వివాదం
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని ప్రతిపక్షం, ముఖ్యంగా శిరోమణి అకాలి దళ్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం సెట్‌లు లీక్ అయ్యాయని, తర్వాత విషయాన్ని దాచిపెట్టేందుకు అసాధారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షపై పారదర్శక విచారణ జరిపి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పట్టభద్రులు, యువ అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఇవేగాక, పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లోనూ విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. 
  

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)