Breaking News

విద్యార్థులకు యూనివర్శీటీల బెదిరింపు : రాహుల్‌ గాంధీ ఫైర్‌

Published on Fri, 07/24/2026 - 13:24

సాక్షి, న్యూఢిల్లీ:  నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థి లోకం, శాంతియుతంగా పోరాడుతోంది. అయిత్‌ తమ విద్యార్థులు జంతర్‌మంతర్‌ నిరసనలో పాల్గొనవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ యూనివర్సిటీ (DU), JNU హెచ్చరికలు జారీ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 > సోషల్‌ మీడియాలో ఆయా విద్యాసంస్థల ట్వీట్స్‌పై స్పందించిన రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యహక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులను బెదిరించడానికి ఎంత ధైర్యం? అంటూ ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.

విద్యార్థులపై  అప్రజాస్వామికంగా బెదిరింపులకు పాల్పడిన యూనివర్శిటీల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చట్ట విరుద్ధమని  ఏ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని DU పూర్వ విద్యార్థి, కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్ హుడా ప్రశ్నించారు. విద్యార్థులకు అబద్ధాలు చెప్తున్న DU తీరు సిగ్గుచేటని హుడా విమర్శించారు. మరోవైపు విద్యార్థుల గొంతు నొక్కితేనే వారి భవిష్యత్తుకు ఎక్కువ ప్రమాదం. వారి హక్కులకు మనం మద్దతుగా నిలవాలని నటిచదర్శకురాలు పూజా భట్ హితవు పలికారు.

 

ఇదీ చదవండి: నీట్‌ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు 'చట్టవిరుద్ధమైన కూడళ్ళు' (unlawful assemblies) అని, వాటిలో పాల్గొంటే విద్యార్థుల భవిష్యత్తు, అకడమిక్ అవకాశాలు దెబ్బతింటాయని DU, JNU యాజమాన్యాలు హెచ్చరించాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించాయి.

ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్‌ గాంధీ

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)