ఢిల్లీలో రేవంత్‌ ఇంట్లోకి మహిళా అధికారికి నో ఎంట్రీ

Published on Sun, 10/26/2025 - 04:54

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహి­ళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్‌ పీఆర్‌ ఢిల్లీ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు. 

కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్‌ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. 

అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్‌ పీఆర్‌ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్‌ గోయల్‌ ‘సాక్షి’కి చెప్పారు.  

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)