Breaking News

నీట మునిగిన షాజహాన్‌పూర్‌.. తొమ్మిదిమంది మృతి

Published on Thu, 07/11/2024 - 09:44

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నీట మునిగింది. నగరంలోని 20కి పైగా ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సమీప గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల మంది వరద బారిన పడ్డారు. బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు  ఎన్‌డిఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది.  

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద నీటిలో కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. లఖింపూర్ ఖేరీలో ఐదుగురు, బరేలీలో ఇద్దరు, పిలిభిత్‌లో ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. బదౌన్‌లో మోపెడ్‌తో సహా ఒక యువకుడు నీటి మునిగాడు. ఈ వరద ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆహారం లేక అలమటిస్తున్నారు.

ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న గర్రా, ఖన్నాత్ నదులలోని నీరు షాజహాన్‌పూర్‌లోకి ప్రవేశించింది. ఈ నగరం ఈ రెండు నదుల మధ్య ఉంది. స్థానిక మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు.. రెండు వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  కాగా రానున్న మూడు, నాలుగు రోజుల పాటు యూపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం లఖింపూర్ ఖేరీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్‌లలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సమాచారం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)